ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణనిర్మాణంలో ఉండగానే అనుమతులు ఎలా..?

నిర్మాణంలో ఉండగానే అనుమతులు ఎలా..?

📰 Generate e-Paper Clip

విద్యాశాఖ అధికారులకు సోషల్ జస్టీస్ పార్టీ నోటీసులు

శాంక్టా మేరియా కార్పొరేట్ స్కూల్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్

ప్రతిఘటన, తెలంగాణ బ్యూరో ప్రతినిధి

అత్యంత సునిశితమైన శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పరిధిలో ఒకవైపు నిర్మాణం కొనసాగుతుండగానే మరో వైపు పాఠశాల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులకు, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండల విద్యాశాఖ అధికారులకు సోషల్ జస్టీస్ పార్టీ లీగల్ నోటీసులు జారీ చేసింది. సోషల్ జస్టీస్ పార్టీ ప్రతినిధి చెప్పిన వివరాల ప్రకారం.. శంషాబాద్ లోని ఎయిర్ పోర్ట్ పరిధిలో శాంక్టా మేరియ ఇంటర్నేషనల్ స్కూల్ భవన నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ స్కూల్ నిర్వహణకు ఒకవైపు నిర్మాణం జరుగుతుండగానే మరోవైపు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అనుమతులు ఇవ్వడం వెనక అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. అత్యంత సునిశితమైన ప్రాంతమైన ఎయిర్ పోర్ట్ పరిధిలో నిర్మాణం పూర్తి కాకముందు అనుమతులు ఎలా ఇచ్చారని..? ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని నోటీసులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖలో అధికారులు అవినీతికి అలవాటు పడ్డారని విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ (ఓసీ), ఫైర్ సేఫ్టీ, ప్లేగ్రౌండ్ నిర్వహణ, రోడ్డు కనెక్టివిటీ వంటి సర్టిఫికెట్లు పొందక ముందే విద్యాశాఖ అధికారులు అనుమతులు మంజూరు చేయడం వారి అవినీతికి అద్దం పడుతుందన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రెడ్ బెల్ట్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ముడుపుల కోసం విద్యాశాఖ అధికారులు అనుమతులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. విద్యాశాఖ ప్రారంభం కాకముందే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసేందుకే ముందస్తు అనుమతులు పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంక్టా మేరియా కార్పొరేట్ స్కూల్ కు వెంటనే అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సోషల్ జస్టీస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!