ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్నాలాని ఆక్రమించి లే ఔట్ చేసిన హరిమోహన్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలి

నాలాని ఆక్రమించి లే ఔట్ చేసిన హరిమోహన్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

రంగనాథ్ కు వినతి

కబ్జాలకు గురైన దాదాపు 109 ఎకరాల సున్నం చెరువుని కాపాడాలి

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

మహేశ్వరం నియోజకవర్గం లోని శంషాబాద్ జోన్ బడంగ్ పేట్ సర్కిల్ 61వ డివిజన్ లోని నాదర్ గుల్ ఓల్డ్ విలేజ్ లోని గ్రీన్ హోమ్స్ కాలనీ లో నాలా ని అక్రమంగా మూసివేసి లే ఔట్ చేసిన హరిమోహన్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలాలు అక్రమంగా మూసివేసి పైప్ లైన్ వేసిన నాలా ని ఓపెన్ చేయాలని అలాగే కబ్జాలకు గురైన దాదాపు 109 ఎకరాల సున్నం చెరువుని కాపాడాలని కోరడం జరిగిందన్నారు. స్పందించిన కమిషనర్ అక్కడ శాటిలైట్ ద్వారా నాలా మ్యాప్ ని ఓపెన్ చేసి 2001 లో ఎలా వున్నది, ప్రస్తుతం ఎలా వున్నది అని స్పెషల్ టీం కి చూపించారు. మ్యాప్ ఆధారంగా స్పెషల్ టీం తో త్వరలో వస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు వల్లపు సుభాన్ యాదవ్, మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రేస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ అంకంగారి వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు ఆనంద్ రెడ్డి, బంగారి అశోక్, కుమార్ యాదవ్ , యాతం సాయి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!