- ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు తాజా ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి కళాశాలకు గౌరవాన్ని తెచ్చారు. ఈ సందర్భంగా గురువారం కళాశాల ప్రిన్సిపాల్ సుప్రజాత ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను అధ్యాపకుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినులు భవిష్యత్తులో దృఢ సంకల్పంతో చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాలని సూచించారు. అలాగే తమ తల్లిదండ్రులు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో తక్కువ మార్కులు సాధించిన, ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 20, 2026 సాయంత్రం 5 గంటలలోపు కళాశాలలో పరీక్ష ఫీజు చెల్లించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.