ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య
దోమల వృద్ధి అధికమై ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తుక్కుగూడ మాజీ కౌన్సిలర్ సప్పిడి లావణ్య రాజు ముదిరాజ్ అన్నారు. తుక్కుగూడ ప్రాంతంలో దోమల వృద్ధితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దోమల నివారణకు ఫాగింగ్ చేయించాలని ఆయన స్థానిక నాయకులు ఉప్పునూతల శ్రీనివాస్, ఢిల్లీ విజయ్ కుమార్ లతో కలిసి కమిషనర్ చంద్రకళకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తుక్కుగూడ గ్రామంలో చాలా కాలంగా దోమల నివారణకు పాగింగ్ నిర్వహించకపోవడం వల్ల దోమల సంఖ్య అధికమై ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. దీనిపై తక్షణమే ఫాగింగ్ చేయించాలని కోరారు. అదే విధంగా తుక్కుగూడ మెయిన్ రోడ్ హెచ్ పీ పెట్రోల్ బంక్ గల్లి వద్ద ఫాస్ట్ ఫుడ్ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు రహదారిపై ఆక్రమణ చేసి ట్రాఫిక్ కు తీవ్రమైన అంతరాయం కలిగిస్తున్నారన్నారు. దీనివల్ల రోజు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఇంకా కొన్ని స్థానిక కంపెనీలు తమ బస్సులను మేయిన్ రోడ్ పక్కన ఆపడం వల్ల ట్రాఫిక్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందన్నారు. ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందన్నారు. వెంటనే పరిశీలించి, తగిన చర్యలు తీసుకొని దోమల నివారణకు ఫాగింగ్ చేయించి ట్రాఫిక్ అడ్డంకులను తొలగించడంపై అత్యవసర చర్యలు తీసుకోవాలని కోరారు.