ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ప్రతిఘటన, ఎల్బీనగర్ ప్రతినిధి:
ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్.జీ.ఓ కాలనీ పెద్దలు, కాలనీవాసులు కలిసి లైబ్రరీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు గ్రంధాలయం పనులు వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యేని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గ్రంధాలయం పనులు తాను ఎప్పుడు ఆపలేదని గతంలో కొందరు బీజేపీ కార్పొరేటర్ల దుందుడుకు చర్యల కారణంగా పనులు నిలిచిపోయాయని తెలిపారు. గ్రంధాలయం పనులు వెంటనే బుధవారం నుండి ప్రారంభించాలని అక్కడే ఉన్న గ్రంథాలయం ఈ.ఈ, డి.ఈ ఆదేశించారు. బుధవారం నుండి గ్రంధాలయం పనులు ప్రారంభం కానుండడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బీ.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో కాలనీ పెద్దలు సోమయాజులు, పంపన్న వెంకటేశ్వర, శివనాగేశ్వర్ రావు, వేముల జైపాల్ రెడ్డి, వర్ధని, శశిధర్ రెడ్డి, ఓంప్రకేష్, భూషణ్, విశ్వనాథం, శ్యాంకుమార్, ఆనంద్ ఎన్జీవో కాలనీపెద్దలు, చుట్టుపక్కల కాలనీ పెద్దలు, భారస నాయకులు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అనిల్ చౌదరీ, యూత్ అధ్యక్షులు మునగాల రాఘవేందర్ రావు, కొంగర మహేష్, నీళ్ల రాజశేఖర్ గౌడ్, నరేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, అమర్థ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.