prathighatana.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 1:20 pm Digital Edition : PRATHI GHATANA

తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య విగ్రహా ఆవిష్కరణ

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు సిరిపురం యాదయ్య 37వ జయంతి సందర్భంగా. మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో అమరవీరుడు సిరిపురం యాదయ్య విగ్రహాన్నీ ఆవిష్కరణ చేశారు. తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిక్కిరి శ్రీకాంత్, యాదయ్య కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత గ్రామంలో సిరిపురం యాదయ్యది విగ్రహవిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రాణ త్యాగం చేసి అమరుడయ్యారన్నారు. భగభగ మండే మంటల్లో ఉద్యమ స్ఫూర్తిని జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ కలలుగన్న తెలంగాణ కోసం సమాన హక్కులు ప్రతి ఒక్కరికి అందజేయడమే లక్ష్యంగా అమరుడయ్యాడని కొనియాడారు. ఓయూ గేట్ వద్ద ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మార్పణ చేశారన్నారు. 85% గాయాలతో తెలంగాణ ఏర్పాటు కోసం ఆయన చనిపోయి నేడు తెలంగాణ వ్యాప్తంగా.. సిరిపురం యాదయ్య జయంతి వేడుకలు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మహేశ్వరం రాజేష్, తెలంగాణ ఉద్యమ నాయకురాలు లావణ్య జగన్, తెలంగాణ అమరుడు సిరిపురం యాదయ్య అన్నయ్య వదిన తో పాటు యాదయ్య మేనమామ దాస వెంకటయ్య నేత, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.