prathighatana.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 2:42 pm Digital Edition : PRATHI GHATANA

తాడూరు కేజీబీవీ బాలికలకు హెచ్.పీ.వీ టీకా

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్

తాడూరు మండల పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం బాలికలకు సోమవారం గర్భాశయ క్యాన్సర్ నిరోధకానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సరఫరా చేసిన హెచ్.పి.వి టీకాల పంపిణీ కార్యక్రమాన్ని తాడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సంతోష్ అభిరామ్ ప్రారంభించారు. కస్తూర్బా గాంధీ విద్యాలయంలో చదువుతున్న అర్హులైన బాలికలకు 8 మందికి టీకాలు వేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఆరోగ్య కార్యకర్త లక్ష్మి కుమారి, రాజేశ్వరి, షాహిన్ సుల్తానా, సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.