prathighatana.com
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 6:49 am Digital Edition : PRATHI GHATANA

డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

పనులను పరిశీలించిన తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

ప్రతిఘటన, ఎల్బీనగర్ ప్రతినిధి :

హయత్ నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీ ప్రియ కాలనీలో కొనసాగుతున్న భూగర్భ డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని తమ హయాంలోనే ఈ పనులకు నిధులు మంజూరు చేయించామని చెప్పారు. పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ప్రతి కాలనీ అభివృద్ధి చెందేలా కట్టుబడి పనిచేస్తామని, హయత్ నగర్ డివిజన్‌ను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్, నాయకులు సురేష్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నరు.