prathighatana.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 3:52 pm Digital Edition : PRATHI GHATANA

డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లో ఉన్న మౌళిక వసతుల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మినీ మీటింగ్ హల్ లో భువనగిరి మండలంలోని సింగన్న గూడెం, బీబీనగర్, వంగపల్లి, నారాయణపూర్, పోచంపల్లి, జిబిలకపల్లి లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మౌళిక వసతులపై జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, హౌసింగ్ అధికారులతో కలసి సమీక్షించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ.. డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఇంకా ఏ ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయని , ప్రస్తుతం జరుగుతున్న పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి సంబంధించిన పనులను త్వరగా పూర్తిచేసి ఉపయోగంలోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పి.డి) శ్రీ రాములు, ఆర్ అండ్ బి అధికారి సరిత, పి ఆర్. ఈ ఈ దసయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.