ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణజీవో 252 తో వర్కింగ్ జర్నలిస్టులు నష్టపోతున్నారు

జీవో 252 తో వర్కింగ్ జర్నలిస్టులు నష్టపోతున్నారు

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

జీవో 252 తో వర్కింగ్ జర్నలిస్టులు నష్టపోతున్నారని, జీవో 252 ని సవరించి ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేరిబాయి గణేష్, మైల సైదులు అన్నారు.టీడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట, డెస్క్ జర్నలిస్ట్ లకు, వర్కింగ్ జర్నలిస్టుల అందరికి ప్రభుత్వ గుర్తింపు కార్డును ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ లు మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ నియామక ప్రక్రియను నిలిపి వేయాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా రఘు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, రెట్టింపు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని చెప్పి.. ఉన్నవాటిలో ఎందుకు కోతలు విధిస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జర్నలిస్టులను ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటూ కొత్త జీవోలు తీసుకొచ్చి వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ జర్నలిస్టుల ఏరి వేత పేరుతో వర్కింగ్ జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గం మున్సిపాలిటీ మండలాలో పనిచేసే జర్నలిస్టులతో పాటు డెస్క్ లో పని చేసే వారికి కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
జీఓ 252 సవరించాకే అక్రిడిటేషన్ కమిటీని నియమించాలని జిల్లా అద్యక్ష, కార్యదర్శులు ఎస్. గణేష్, యం. సైదులు జిల్లా కలెక్టర్, డీపీఆర్వో లను డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252 వర్కింగ్ జర్నలిస్టులు నష్టపోతున్నారన్నారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా కోతలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ మరోసారి వర్కింగ్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డు లు వచ్చేలా జీవో ను సవరించిన తర్వాతే అక్రిడిటేషన్ కమిటీని నియమించాలని లేదంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్ఓ, డీపీఆర్వో లకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులను అందించాలని డిమాండ్ చేస్తూ సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చంద్ర శేఖర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలువేరు సురేష్, ఎండి కాజా పాషా, జిల్లా డెస్క్ జర్నలిస్ట్ లు సంఘం రాష్ట్ర నాయకులు అజయ్ కుమార్, రాజేందర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేష్, సుదర్శన్, మణి, నర్సింహారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు క్రాంతి, అంజి, శ్రీశేలం, శ్రీనివాస్, శివ, నియోజకవర్గాల అధ్యక్ష కార్యదర్శులు పల్లటి జగన్, రాఘవేందర్ గౌడ్, శంకర్, సురేందర్, నర్సింహా, భూచ్చన్న, భగవంతు, జర్నలిస్ట్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!