prathighatana.com
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 2:26 pm Digital Edition : PRATHI GHATANA

జనగణన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి

అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్

జనగణన-2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, ఛార్జ్ అధికారులు , మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మంగళవారం చివరి రోజు జనాభా గణన–సెన్సెస్ 2027కు సంబంధించి అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని రెండు దశల్లో నిర్వహించే గణనను సమగ్రంగా చేపట్టాలని సూచించారు. జనాభా గణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. హౌస్ లిస్టింగ్ ను కచ్చితంగా చేసినట్లయితే సెన్సెస్ పూర్తి అయినట్లే అని అన్నారు. బ్లాక్ ల వారీగా ఏర్పాటు చేసుకొని సులభతరంలో సెన్సెస్ చేయాలన్నారు. ప్రతి దశను క్షేత్రస్థాయిలో, పారదర్శకంగా సెన్సెస్ నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జనాభా గణన సెన్సెస్ -2027 ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, సమగ్ర సమాచారం సేకరణపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా గణాంక అధికారి వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్లు, తాహసిల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.