ప్రతిఘటన జోగులాంబ గద్వాల రిపోర్టర్ గడ్డం సుధాకర్
గట్టు మండల కేంద్రంలోని రైతు వేదికలో గట్టు చేనేత సహకార సంఘం అధ్వర్యంలో ఆప్కో మాజీ డైరెక్టర్, గట్టు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు దోమ వీరన్న అధ్యక్షతన చేనేత సంఘం సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత వర్గం నుంచి ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, గద్వాల మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన కౌన్సిలర్ లను ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో గద్వాల మున్సిపాలిటీ 21వ వార్డు కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్, ఆరగిద్ద గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ యం.డి. రఫి, 2వ వార్డు మెంబర్ జి. విరుపాక్షి, గొర్ల ఖాన్ దొడ్డి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మెంబర్ ముని స్వామి, తిరుపతి, మాచర్ల గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పి.జి.శంకరమ్మ, కనికె వెంకటేష్, రాజోలి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వంక మహేష్ , సిరిసాల మధు, గొరకల్లు వీరేష్, చాంద్ పాషా, మల్లెంపల్లె గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ మాచాని తిమ్మప్ప, వార్డు మెంబర్ పూజారి రమేష్, సిందనూర్ గ్రామ పంచాయతీ వార్టు మెంబర్ వినోద్, తదితరులు ఉన్నారు. సన్మాన కర్త జోగుళాంబ గద్వాల జిల్లా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్ మాట్లాడుతూ.. పద్మశాలి వర్గం విజేతలను ఘనంగా సన్మానించుకోవడం మంచి శుభపరిణామం, ఎల్లవేళలా పరస్పరం సహకరించుకుంటూ పోగు బంధాన్ని బలపరచుకుని మన చేనేత కార్మికుల ఐక్యతను చాటాలని, చేనేత వర్గం లో బలమైన నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అదే విధంగా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో మన ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గం కూనె చంద్రశేఖర్, బుదారపు లక్ష్మి నారాయణ, సిరసాల నాగరాజు, కూనె శంకరప్ప, బుదారపు అయ్యప్ప, మల్లెంపల్లి లక్ష్మి నారాయణ, బుదారపు చంద్రశేఖర్, గోరంట్ల గోవిందు, జేరుబండి జయన్న, మెడికల్ జయన్న, సంఘ సర్వ సభ్యులు, చేనేత మరియు అనుబంధ వర్గాల నాయకులు, చేనేత కార్మికులు
తదితరులుపాల్గొన్నారు.
