ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య
చత్రపతి శివాజీ స్పూర్తి తో పోరాటాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోలన్ శంకర్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ని , కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ని పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్టు చేసి నిర్బంధించారని తెలుసుకొని శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో వారి ఇంటికి వెళ్లి రాష్ట్ర చీఫ్ రామచందర్ రావ్ ని సంఘటన విషయాలు అడిగి తెలుసుకున్నారు . వారితో పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పై చత్రపతి శివాజీ స్పూర్తి తో పోరాటాలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అని విజ్ఞప్తి చేసి ” శాలువాతో సత్కరించి, హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ విగ్రహాని భాహుకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రామిడి మహేందర్ రెడ్డి, మునగాల ప్రభాకర్ రెడ్డి, పెద్దింటి సుధాకర్, లక్ష్మణ్ రాజ్ బాస్కర్, ప్రదీప్ పాల్గొన్నారు.