ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
బిజినపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీ వీరభద్రేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించినట్లు శనేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు. కూచుకుళ్ళ వంశీయులు విక్రమ్ రెడ్డి దంపతులు, శేఖర్ దంపతులు, సందీప్, శ్రావ్య దంపతులు శ్రీ వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్ల కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వీరభద్ర స్వామి వారికి పంచామృత విశేష ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం ప్రదోషకాలంలో నిర్వహించి అనంతరం స్వామివారి కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా వేదమంత్రో చరణాల మధ్య నిర్వహించారు. అనంతరం పాల్గొన్న భక్తులందరికీ వేదా ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుగుణమ్మ, ఉప సర్పంచ్ నాగరాజు, గ్రామస్తులు నంద కిషోర్ రెడ్డి, ఆలయ అర్చకులు గవ్వ మఠం ఉమా మహేశ్వర్, శాంతయ్య, మల్లికార్జున్, శివ సాయి సృజన్, మణి శంకర్, గోపాల్ రెడ్డి, ప్రభాకర చారి, శ్రీరాములు, శ్రీకాంత్ గ్రామస్తులు భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
