ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
బిజినపల్లి మండల పరిధిలోని గుడ్లనర్వ గ్రామంలో నాగర్ కర్నూల్ మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకలు గ్రామ నడిబొడ్డున కేక్ కట్ చేసి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వి. చెన్నయ్య మాట్లాడుతూ.. శ్రీరామ నవమి నాడు మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి జన్మించడం ఈ నియోజకవర్గ ప్రజలకు ఆనందదాయకమన్నారు. తాను దశాబ్ద కాలంగా శాసనసభ్యులుగా ఉండి శ్రీరామచంద్రుని లాంటి సుపరిపాలన అందించినవారని, ప్రజలు మరువలేక పోతున్నారు అని వారు అన్నారు. మిగతా నాయకులు మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధికై మరోసారి మర్రన్నను ఎమ్మెల్యేగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని నాయకులన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వి.చెన్నయ్య, మాజీ సర్పంచ్ మహేష్ రావు, పద్మ తిరుపతయ్య, మేకల రాజమౌళి, వడ్ల రామకృష్ణ, వినయ్, వి విజయ్, వి ప్రశాంత్, రాందాస్, శ్రీశైలం, బి రమేష్, గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.