prathighatana.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 3:24 pm Digital Edition : PRATHI GHATANA

ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవం

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు జెండా ఎగరవేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద శక్తివంతమైన రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అన్నారు. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి దేశ ప్రధానిగా ఎదగగల అవకాశాన్ని ఇచ్చిన పార్టీ బిజెపి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాయ దశరథ, మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, పోతంశెట్టి రవీందర్, చందుపట్ల వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జైనపల్లి శ్యామ్ సుందర్ రెడ్డి, పట్నం శ్రీనివాస్, గూడూరు నార్రోతం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు కొప్పుల యాదిరెడ్డి, చందా మహేందర్ గుప్తా, సుర్వి శ్రీనివాస్ గౌడ్, దుర్గాప్రతి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శులు మేడి కోటేష్, వైజయంతి, తడిసిన మల్లారెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి మంగు నర్సింహా రావు, పంచద్దుల బలరాం, ఎంజాల నరసింహారావు, మాజీ కౌన్సిలర్ బోర్ర రాకేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాల్లబండి కృష్ణచారి, కొల్లోజు సతీష్, రత్నపురం శ్రీశైలం, ఎంగిలి లక్ష్మణ్, ఎండి మహమ్మద్, కొల్లి చెల్లిమ్మ మల్లికార్జున్, కానుకుంట్ల రమేష్, రాము, వాస సాయి చరణ్ పాల్గొన్నారు.