prathighatana.com
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 4:02 pm Digital Edition : PRATHI GHATANA

ఘనంగా ప్రిజం విద్యా సంస్థ దశాబ్ది వార్షికోత్సవ వేడుకలు

95 టీంల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్

జిల్లా కేంద్రంలోని ప్రిజం విద్యా సంస్థను స్థాపించి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దశాబ్ది వేడుకలు ఫంక్షన్ హాల్లో పాఠశాల ప్రిన్సిపాల్ తాళ్ల నిరంజన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి ఉపాధి దిశగా వెల్లుతూ సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈ వేడుకలలో విద్యార్థుల యొక్క ప్రతిభ పాటాలు ఆట, పాట, నాట్యరీతిలను కనబరుస్తూ 95 టీంలతో వచ్చినటువంటి విద్యార్థులను, పోషకులను ఆనంద ఉత్సవాలలో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు వారి శాస్త్ర సాంకేతిక జ్ఞాన నివేదికలను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ వేడుకలలో ప్రిజం స్కూల్ యాజమాన్యం కృష్ణయ్య, వైస్ ప్రిన్సిపాల్ దాసర్ల దేవేందర్, స్వప్న పాల్గోని విద్యార్ధులను అభినందించారు. అనంతరం సామూహికంగా భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు దేవేందర్, పవన్, రామకృష్ణ, సలీమ్, భలిందర్, భరత్, వసంత, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.