మునగనూరు జే.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం కాలనీలో అంబేద్కర్ కు ఘన నివాళి
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీజేఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దార సత్యం, భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కానుగుల శ్రీనివాస్
ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజ్యాంగమే – దానిపై దాడులను అడ్డుకుందాం
ప్రతిఘటన, తెలంగాణ బ్యూరో ప్రతినిధి
ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజ్యాంగమే – దానిపై దాడులను అడ్డుకుందామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దార సత్యం, భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కానుగుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా తొర్రూరు డివిజన్ మునగనూరులోని లోని జే.ఎన్.ఎన్.యు.ఆర్.ఎమ్ కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు డా. బీ.ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు. నేడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక రాజ్యాంగ విరుద్ధ విధానాలను అవలంబిస్తున్నాయని ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగ పరిరక్షణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సమర్పించే నిజమైన నివాళి అని అన్నారు. మహనీయుడు అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మునగనూరు మాజీ కౌన్సిలర్ భర్త వేముల అమరేందర్ రెడ్డిని జే.ఎన్.ఎన్.యు.ఆర్. ఎం కాలనీ ప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో మునగనూరు మాజీ కౌన్సిలర్ భర్త వేముల అమరేందర్ రెడ్డి, జే.ఎన్.ఎన్.యు.ఆర్.ఎమ్ అధ్యక్షులు మేతిరి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి సాయి పోగుల, రవితేజ, ఉపాధ్యక్షులు ఆలకుంట రాములు, కోశాధికారి అప్పారావు, దాది మాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.