ఘనంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు
ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య
చేవెళ్ల నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మీర్ పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ 1, 2వ వార్డు అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి, తులసి ముఖేష్ ముదిరాజ్, టీం కేవీఆర్ అధ్యక్షుడు టేకుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల పెన్నిధి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తి ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మీర్ పేట్ కార్పొరేషన్ 58, 59, 60. డివిజన్ల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు ఇంద్రావత్ రవి నాయక్, వెంకటేశ్వర్ రెడ్డి, సిద్దాల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కోడూరు సోమేశ్వర్, ముత్తంగి కరుణానిధి. మాజీ అధ్యక్షుడు పెండ్యాల నరసింహ, గాజుల మధు, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి. మాజీ కార్పొరేటర్లు ఏ భీమ్ రాజ్, కీసర హరినాథ్ రెడ్డి, ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, కొండ్రు గౌరీ శంకర్, యాదగిరి యాదవ్ బెల్లంకొండ నాగరాజ్, నాగేష్, శ్యాంసుందర్, ఉపాధ్యక్షురాలు కుందనం లత, శాంతి కిరణ్ చారి, విజయ్, ఎస్టి మోర్చా అధ్యక్షులు శీను నాయక్, కిసాన్ మోర్చా అధ్యక్షులు గోలి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, అనిల్ కుమార్, జగన్ ముదిరాజ్, మల్లికార్జున్ రమేష్, ప్రదీప్, ప్రశాంత్, భాస్కర్, భాస్కర్ రెడ్డి, కోట్ల గోపాల్ , చందు సంపట్ల, అనిల్ కుమార్, జైపాల్ రెడ్డి, బిజెపి రాష్ట్ర జిల్లా మున్సిపల్ నాయకులు. మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
