ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ మునగపాటి నవీన్

గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ మునగపాటి నవీన్

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

మహేశ్వరం గ్రామంలో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ అన్నారు. వాటర్ ట్యాంక్ వద్ద నూతన బోరును ప్రారంభించారు, నూతనంగా నిర్మించ తలపెట్టిన డ్వాక్రా బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో మంచి నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో మంచి నీటి సమస్య పునరావృతం కాకుండా చేసి ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందించాలనే దృఢ సంకల్పంతో 12 వ వార్డు పరిధిలోని బీరప్ప గుడి ప్రక్కన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ వద్ద నూతన బోరును ప్రారంభించడం జరిగిందన్నారు. అక్కడే నూతనంగా నిర్మించ తలపెట్టిన డ్వాక్రా బిల్డింగ్ కు కూడా శంకుస్థాపన చేశామన్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహకారంతో మహేశ్వరం మండలం కేంద్రంలోని ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జోరల రమేష్, వార్డు సభ్యులు స్వర్ణగంటి సంజీవ, కాకి పరమేష్, ఆకుల వీరబాబు, రుకేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాడమోని ప్రభాకర్, సున్నం కృష్ణ, అవులకాడి శ్రీశైలం, గాజుల శ్రీశైలం, మోతే కృష్ణ, మాడ్గుల రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!