prathighatana.com
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 2:53 pm Digital Edition : PRATHI GHATANA

గుండెపోటు వ్యాధిగ్రస్తుని ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు

మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టీ. ఉషారాణి

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఆదివారం అర్థరాత్రి కోడేరు మండల కేంద్రంకు చెందిన నరసింహ (45) అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రాత్రి ఒంటి గంట సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ వైద్యులు డాక్టర్ బీ. సూర్యనారాయణ వైద్య బృందం డాక్టర్ మాచిపెద్ది మౌర్య విధులలో ఉండి రోగిని ప్రత్యేకంగా పలు ఆరోగ్య పరీక్షలతో పరిశీలించారు. అనంతరం అతనికి గుండెపోటు వచ్చిందని నిర్ధారించి జనరల్ ఫిజీషియన్ విభాగాధిపతి డాక్టర్ సూర్య నారాయణ ఆయన సూచనల మేరకు వైధ్యులు ప్రత్యేక వైద్యం త్రంబో లైసిస్ అందించారు. రోగికి ప్రత్యేకంగా 45వేల రూపాయల విలువగల టెనెక్టి ప్లేస్ ఇంజక్షన్ ఇచ్చి అత్యవసర రోగి గుండెపోటు నివారణతో ప్రాణాలు కాపాడారు. ప్రభుత్వ వైద్యులు అందించిన సేవలకు ఈ ప్రాంత ప్రజలు హర్షిస్తున్నారు. ఉన్నత చికిత్స నిమిత్తం ప్రత్యేక అంబులెన్స్ లో కార్డియాలజీ సేవలకు ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజీషియన్ వైద్యులు డాక్టర్ మాచిపెద్ది మౌర్య, డాక్టర్ వంశీ, డాక్టర్ తన్మై, నర్సింగ్ అధికారులు స్వాతి, వెంకటమ్మ, హలీమా ఉన్నారు.