prathighatana.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 2:22 pm Digital Edition : PRATHI GHATANA

గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ హౌస్ అరెస్ట్

ప్రతిఘటన, తెలంగాణ స్టేట్ బ్యూరో రిపోర్టర్ కనుగుల సాయి కిషోర్

అసెంబ్లీ ముట్టడి సందర్భంగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అవినీతి, అరాచక పాలన, కమీషన్ల రాజకీయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలను భ్రష్టు పట్టించిన ఖాన్ గ్రెస్ ( కాంగ్రెస్) పార్టీ విధానాలను ఖండిస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్ చందర్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తమను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమం కొరకు చేపట్టిన ఉద్యమాలను అణచి వేసే ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచే వరకు న్యాయ పోరాటం ఆగదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిన భూటకపు వాగ్దానాలపై ఇక ముందు బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని వారు హెచ్చరించారు.