ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
కూలి పని కోసం ఇంటి నుండి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన వజ్జినాథ్ తన భార్య మహాదేవితో కలిసి, జీవనోపాధి కోసం కూలీ పనులు చేసుకునేందుకు తమ స్వస్థలం నుండి హైదరాబాద్ కు వచ్చి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ కాలనీలో నివాసం అంటున్నాడు. ఈ నెల 13 న సుమారు ఉదయం 9 గంటల సమయంలో ఆమె భర్త అయిన వజ్జినాథ్( 40) కూలీ పనికి వెళ్తున్నానని చెప్పి బర్కాస్‌కు వెళ్లారు. 15న భార్య మహాదేవి భర్త తో మాట్లాడారు. తనకు పని దొరికిందని ఆయన చెప్పారు. కానీ తాను ఎక్కడ ఉన్నానో మాత్రం చెప్పలేదు. 16 న ఫోన్ చేస్తే ఆమె భర్త మొబైల్ నంబర్ ‘స్విచ్ ఆఫ్’ అని వస్తోంది. ఫిర్యాదుదారురాలు తన భర్త తిరిగి వస్తారని వేచి చూశారు, కానీ ఆయన రాలేదు. దాంతో, ఫిర్యాదు దారురాలు తన భర్త కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో బంధువుల వద్ద గాలించారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ నిష్పలమయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.