prathighatana.com
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 1:09 am Digital Edition : PRATHI GHATANA

కలెక్టరేట్ ముందు అంగన్వాడీల ధర్నా

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్

ప్రభుత్వం అంగన్వాడీలకు బడ్జెట్ కేటాయించి కనీస వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బూరుగు సప్న, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండులు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడిగా గ్రామాలలో పట్టణాల్లో అంగన్వాడీ టీచర్లుగా చిన్న పిల్లలకు విద్యాబుద్ధులు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం సకాలంలో అందిస్తూ దేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా పని చేస్తూ కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ టీచర్ల పట్ల ఆయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. కార్మిక చట్టాలైన ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని రిటైర్మెంట్ అయినా ఆయాలకు, టీచర్లకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని, అంగన్వాడి కేంద్రాలకు సొంత స్థలాలు కేటాయించి భవనాల నిర్మాణం చేపట్టాలని, వేసవి సెలవులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు రమాకుమారి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.