ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య
జీహెచ్ఎంసీ మీర్ పేట్ 60వ డివిజన్ లోని సాయి సామ్రాట్ నగర్ కాలనీ లో దీర్ఘకాలికంగా నెలకొన్న భూగర్భ డ్రైనేజీ ఔట్ లెట్ సమస్యను అధికారులు త్వరగా పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ కోరారు. బడంగ్ పేట్ సర్కిల్ డీఈ వెంకన్న ఏఈ సౌమ్య, మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ అశోక్ ఔట్ లెట్ సమస్యను పరిశీలించారు. ఎనుగుల అనిల్ కుమార్ వారికి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యను, మురుగు సమస్యతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశానుసారం శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ కి ఇటీవల కాలనీ వాసులతో కలసి వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. సోమవారం సాయి సామ్రాట్ నగర్ కాలనీలో నెలకొన్న మురుగు సమస్య పరిష్కారానికి భూగర్భ ఔట్ లెట్ పనులను త్వరితగతిన మొదలు పెట్టడానికి అధికారులు వచ్చి పరిశీలించడం జరిగిందన్నారు. త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేయాలని అధికారులను తాను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు లక్ష్మారెడ్డి, విమల్ శుక్లా, పర్వతాల్ రెడ్డి పాల్గొన్నారు.
