ఎస్సీ కాలనీలో కొత్త పనులు ప్రారంభించిన సర్పంచ్ బాలస్వామి
ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్
బిజినపల్లి మండలంలోని గుడ్లనర్వ గ్రామంలో తను ఎన్నికలో ఇచ్చిన హామీలో భాగంగా ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కొబ్బరికాయ కొట్టి ఆదివారం గ్రామ సర్పంచ్ లేట్ల బాలస్వామి ప్రారంభించారు.15 సంవత్సరాలుగా డ్రైనేజీ లేక బాధపడుతున్న ఎస్సీ కాలనీ వాసుల కళ నెరవేర్చానని వారన్నారు.వట్టెం రాములు ఇంటి నుండి,లేట్ల పెంటయ్య ఇంటి వరకు,మరియు బైండ్ల రాజు ఇంటి నుండి,రెడ్డపాకుల పెద్ద మల్లయ్య ఇంటి వరకు డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామన్నారు.ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా పూర్తి చేస్తానని,గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు.స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారి చొరవతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొడిదల రాము,గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీకాంతరావు,ఎల్ వెంకట్,పద్మ శ్రీను,అతినారపు సంజీవ,గొల్ల రాజు,చిన్న భీమ్లా,గ్రామ వార్డు మెంబర్లు రామగళ్ల మన్యం,భీమ రావు,లేట్ల శివకృష్ణ,అలివేల, మరియు బాల్ నారాయణ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.