ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా రిపోర్టర్ జంగిటి రవీందర్
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం వినాయక చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురూపంగా ప్రకాష్, వనం ఉపేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన 3,24,234 కోట్ల బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమనికి 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 5 శాతం నిధులు కేటాయించాలని కానీ బడ్జెట్ కేటాయింపుల్లో వికలాంగుల సంక్షేమ శాఖను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2025-26 బడ్జెట్ లో రూ. 77 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2026-27 బడ్జెట్ లో నిధుల కేటాయింపులో ఎలాంటి పురోగతి లేదని మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు 3143 కోట్లు కేటాయించిందని, ఇందులో వికలాంగుల సంక్షేమానికి ఎంత కేటాయించారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ లో కాంట్రాక్టులు , కమీషన్స్ కోసమే నిధులు కేటాయించారు తప్ప ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను సవరించి వికలాంగుల సంక్షేమనికి నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, భువనగిరి మండల నాయకులు పాండాల శ్రీహరి, ఎం.డి సలాం, గోపి, దండ బోయిన గణేష్, రాసాల నవీన్, కృష్ణయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.