జిల్లా జనరల్ ఆసుపత్రిలో 14 ఏళ్ల ఆడపిల్లలకు ఉచితం
సద్వినియోగం చేసుకోండి -డాక్టర్ సృజన
ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి లోని గది నెంబర్ 22 ఓపీ యూనిట్ లో 14 ఏళ్ల వయసు గల ఆడపిల్లలకు గర్భాశయం ముఖ ద్వారా క్యాన్సర్ నిరోధకానికి ఉచితంగా హెచ్.పీ.వీ టీకాను ప్రత్యేక శిబిరంలో ఉచితంగా వేస్తున్నట్లు పీపీ. యూనిట్ వైద్యాధికారి డాక్టర్ పీ.సృజన తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. తేదీ ఏప్రిల్ 1వ తేదీ 2011 నుండి 31 మార్చి 2012 మధ్య తేదీలో జన్మించిన ఆడపిల్లలకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా ముందుగా వ్యాధి నిరోధకంగా హెచ్.పీ.వీ టీకాను ఓపీ యూనిట్ గది నెంబర్ 22లో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు ఉచితంగా టీకాలు వేస్తున్నట్లు ఆమె తెలిపారు. అర్హులైన ఆడపిల్లలు టీకాకు వచ్చే సమయంలో ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, తల్లిదండ్రులు లేదా సంరక్షకులను వెంట తీసుకొని రావాలని ఆమె సూచించారు. ఈ టీకా ద్వారా ఎలాంటి దుష్ప్రమాణాలు ఉండవని తెలిపారు. మరిన్ని వివరాలకు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టీ.యాదగిరి ని నేరుగా లేదా సెల్ నెంబర్ 9014932408 లో సంప్రదించాలని కోరారు.