prathighatana.com
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 2:42 pm Digital Edition : PRATHI GHATANA

ఈ నెల 6న నాగర్ కర్నూల్ లో డైరీ సైన్స్ లైఫ్ సైన్స్ విద్యార్థులకు జాబ్ మేళా

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో ప్రతినిధివిజయ్ కాంత్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డైరీ సైన్స్, బీఎస్సీ లైఫ్ సైన్స్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాను నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్ తెలిపారు. జాబ్ మేళా కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సిరవిన్ బయోలాజికల్ లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఈ జాబ్ డ్రైవ్ నిర్వహించబడుతుందన్నారు. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొననున్నట్లు ఆయన చెప్పారు. ఈ జాబ్ మేళాలో జూనియర్ ఆఫీసర్ (అనిమల్ ఫార్మ్ డెవలప్‌మెంట్), ఎగ్జిక్యూటివ్ (అనిమల్ ఫార్మ్ డెవలప్‌మెంట్) పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. డైరీ సైన్స్, బీఎస్సీ లైఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు, లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు, తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలతో ఈనెల 6న సోమవారం ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు.18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9848289763 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అంజయ్య, ఉమాదేవి, దశరథం, ముజఫర్, నరేష్, రాఘవేందర్, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.