ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeమహబూబ్ నగర్ఈ నెల 25న పాలెంలో మెగా వైద్య శిబిరం

ఈ నెల 25న పాలెంలో మెగా వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

పాలెం వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ కాంత్

ఈనెల 25వ తేదీ (బుధవారం) ఉదయం 9 గంటల నుంచి పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు స్పెషలిస్ట్ వైద్యులచే ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని స్థానిక వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. నిపుణులైన డాక్టర్లు గ్రామాలకు వచ్చి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు వైద్యుల సలహాలు సూచనలు ట్రీట్మెంట్ తీసుకొని ఆరోగ్యకరమైన జీవితం గడపాలని కోరారు. 25న జరిగే వైద్య శిబిరం నందు స్త్రీ వైద్య నిపుణులు, చిన్న పిల్లల వైద్య నిపుణులు, ఎముకలు /కీళ్ల వైద్య నిపుణులు దంత వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, జనరల్ ఫిజీషియన్ మొదలగు డాక్టర్లు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి నుంచి వచ్చి ఈ క్యాంపును నిర్వహిస్తున్నారు. కాబట్టి బిజినపల్లి మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ప్రియాంక సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!