ఈనెల 31న పరమ శివునికి రుద్ర అభిషేక బిల్వార్చన పూజలు శివపార్వతుల కళ్యాణం
ఏప్రిల్ 1న శనేశ్వర స్వామికి శతకుంభ మహాన్యాస పూర్వక తిలతైల అభిషేకాలు శనీశ్వర స్వామి వారి కళ్యాణం
ఏప్రిల్ 2న ఉమామహేశ్వర స్వామి వ్రతం రుద్ర హోమం
ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయకాంత్
బిజినపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో వెలిసిన శ్రీ శనీశ్వర స్వామి శ్రీ నందీశ్వర శనేశ్వర స్వామి దేవస్థానం యొక్క 26 వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 31 నుండి ఏప్రిల్ 2 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు శనేశ్వర దేవాలయం చైర్మన్ వెల్దండ గోపాలరావు, శనేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి లు తెలిపారు. ఈనెల 31న మంగళవారం శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం త్రయోదశి సందర్భంగా శ్రీ నందీశ్వర స్వామి వారికి ఉదయం 9 గంటలకు బ్రహ్మసూత్రం గల పరమశివునికి విశేష రుద్రాభిషేకం, బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు శివపార్వతుల కళ్యాణోత్సవం, అగ్ని ప్రతిష్ట, దీక్ష హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీన బుధవారం చతుర్దశి రోజు శ్రీ జేష్టాదేవి సమేత శనేశ్వర స్వామి వారికి 100 కుంభాలతో మహాన్యాస పూర్వక తిలతైల అభిషేకం, శనేశ్వర హవనం, మహా మంగళ హారతి ప్రత్యేకంగా భక్తులచే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ జేష్ఠదేవి సమేత శ్రీశనీశ్వర స్వామి వారికి కల్యాణోత్సవం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్ర హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2న గురువారం చైత్ర పౌర్ణమి సందర్భంగా 10 గంటలకు శ్రీ ఉమా మహేశ్వర స్వామి వ్రతం, శాంతి హోమం, బలిహరణ, పూర్ణాహుతి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు నంది వడ్డేమాన్ గ్రామంలో బండ్లు తిరుగుట కార్యక్రమం ఉన్నట్టు తెలిపారు. భక్తులు ప్రత్యేక మహాన్యాస పూర్వక తిలతైల అభిషేక పూజలో నేరుగా లేదా వర్చువల్ విధానంలో పాల్గొనుటకు 258 రూపాయలు సెల్ నెంబర్ 94402 31325 లేదా 8186821212 కు ఫోన్ పే ద్వారా పంపి వాట్సాప్ చేయాలని తెలిపారు.

మూడు రోజులు పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో వచ్చిన భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాదం (భోజనం) ఏర్పాటు ఉన్నట్లు తెలిపారు. ఉదయం సాయంత్రం వేళలో తీర్థప్రసాదాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శనీశ్వర స్వామి కృపా కటాక్షాలు పొందాలని వారు కోరారు.
