prathighatana.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 1:45 pm Digital Edition : PRATHI GHATANA

ఇసుక డంప్‌ లు సీజ్‌

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

రెవెన్యూ అధికారుల హెచ్చరిక

ప్రతిఘటన, జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో ప్రతినిధి గడ్డం సుధాకర్

జిల్లా కేంద్రంలోని గట్టు మండలం బల్లెర గ్రామ శివారులో అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంపులను గురువారం రెవెన్యూ అధికారులు గుర్తించారు. అధికారుల అనుమతులు లేకుండా గ్రామ శివారులో ఒకే చోట దాదాపు అయిదు టిప్పర్ల వరకు నిలువ చేసిన ఇసుకను పోలీసుల సహాయంతో విచారణ జరిపి సీజ్‌ చేసినట్లు తహసీల్దార్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్‌ఐ శేఖర్‌ గౌడ్‌, ఆర్‌ఐ, తదితరులు పాల్గొన్నారు.