ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ఇఫ్తార్ విందులు హిందూ – ముస్లింల ఐక్యతకు వేదికలుగా మారుతున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు నందీశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులకు ఖర్జూర పండు తినిపించి ఉపవాస దీక్ష విరవింప చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఇఫ్తార్ విందుకు అమీర్ పేట్ గ్రామానికి చెందిన ముస్లిం మైనారిటీ సోదరులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతించి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ ముస్లిం మైనారిటీ సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల అధ్యక్షుడు రాజు నాయక్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.