మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి, ఆత్మీయతకు, సోదరభావానికి ప్రతీకలు అని డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం పరిదిలోని దుబ్బచర్ల గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాంగీర్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రంజాన్ ఉపవాసాల సందర్భంగా రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదిగా, ముస్లిం సోదరులు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు ఆచరిస్తూ భగవంతున్ని ప్రార్థిస్తూ ఉంటారని అన్నారు. రంజాన్ తోఫా తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇమామ్, మొజామ్ లకు శాలరీలు దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ అందించారన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇఫ్తార్ విందులను తెలంగాణ రాష్ట్రంలో కేవలం తొలి సీఎం కేసీఆర్ మాత్రమే నిర్వహించారన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకా ఇఫ్తార్ విందులు లేవు, రంజాన్ తోఫాలు లేవు అని ఎద్దేవా చేశారు.
