prathighatana.com
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 2:45 pm Digital Edition : PRATHI GHATANA

ఇఫ్తార్ విందులు ప్రతి ఒక్కరిలో సోదర భావం పెంపొందిస్తాయి

టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు భావాండ్ల వెంకటేష్

టీఎన్జీవో ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయకాంత్

పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్ లో మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు, ముస్లిం ఉద్యోగస్తులకు ఇఫ్తార్ విందును ఇచ్చినట్లు టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు భావాండ్ల వెంకటేష్, జిల్లా కార్యదర్శి షర్ఫుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగ మిత్రులు సోదరులు పవిత్రంగా ఉంటారని, ఈ మాసంలో ఒకరోజు వారికి ఇఫ్తార్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కొట్ర బాలాజీ, చెన్నకేశవులు, పి.కళ్యాణ్ కృష్ణారావు, జీ.కే.వెంకటేష్, శ్రావణ్, కరిముల్లా, రహీం అహ్మద్ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ముస్లిం ఉద్యోగ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.