మహేశ్వరం మండల పరిధిలోని అమీర్ పేట్ గ్రామ బీజేపీకి భారీ షాక్
ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య
భారతీయ జనతా పార్టీ నుండి రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా బడ్జెట్లో మాత్రం గుండు సున్నా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. మహేశ్వరం మండలం పరిధిలోని అమీర్ పేట్ గ్రామ ఉద్యమ కారుడు, మాజీ కో ఆప్షన్ సభ్యులు అవుల అశోక్, మాజీ ఉప సర్పంచ్, ప్రస్తుత వార్డు సభ్యులు పోతుల నర్శింగ్ పటేల్, మాజీ ఎంపీటీసీ పెంటల రాయప్ప ఆధ్వర్యంలో, రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రోద్బలంతో మహేశ్వరం మండలం అమీర్ పేట్ గ్రామానికి చెందిన బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి, కంటెస్టెంట్ సర్పంచ్ కరణ్ కోట్ నందీశ్వర్, వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షుడు కరణ్ కోట్ మల్లికార్జున్, వార్డు సభ్యులు వర్కల సుధాకర్, కరన్ కోట్ కమల్ ప్రసాద్, కరణ్ కోట్ అశోక్, వర్కల ఆంజయ, కొత్త పల్లి రమణ, కరణ్ కోట్ జ్ఞానేశ్వర్, కరణ్ కోట్ పాండు, కరణ్ కోట్ దినాకర్, అనుప యాదయ్య, అనుప సామయ్య, డప్పు చెంద్రయ్య, చంద్రబాబు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పని మొదలు పెట్టలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం రెండున్నర సంవత్సర కాలంలో అంధకారంలా మారిందని, బీజేపీకి రాష్ట్రం నుండి ఎనిమిది మంది ఎంపీలలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా బడ్జెట్లో మాత్రం గుండు సున్నా మిగిలిందన్నారు. కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకునే బీజేపీని ప్రజలు నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు నందీశ్వర్ మాట్లాడుతూ.. బీజేపీ దగా మోసాలను పసిగట్టి ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగిందని, అలాగే మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులమై సబితమ్మ బాటలో గ్రామ అభివృద్ధి కొరకు బీఆర్ఎస్ పార్టీలో చేరామన్నారు.