prathighatana.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 2:02 pm Digital Edition : PRATHI GHATANA

ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు -ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కలిసిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కమిటీ సభ్యులు

ప్రతిఘటన , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి నుంచి మానవులు ఉపశమనం పొందడానికి ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని, వాటి పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ముత్యాలమ్మ తల్లి పునః విగ్రహ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే విగ్రహ ప్రతిష్టకు కావలసిన పనులకు, ఆలయ ప్రాంగణంకి సంబంధించిన నిర్మాణ పనులు, అలాగే కొన్ని అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.