ప్రతిఘటన, రాజేంద్రనగర్ ప్రతినిధి హబీబ్
ఆరాంఘర్ చౌరస్తా నుంచి మెహిదిపట్నం వైపు వెళ్లె మార్గంలో వెలసిన ఫుట్ పాత్ ఆక్రబడాలడు జీహెచ్ఎంసీ అదికారులు జేసిబీలతో తొలగించారు. పిస్తిహౌజ్ నుంచి పీవిఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే ర్యాంప్ వరకు పుట్ పాత్ పై ఉన్న అక్రమణల వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. ప్రదానంగా నగరం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే వీఐపీలు రాకపోకలు సాగిస్తుంటారు .ఆరాంఘర్ చౌస్తా లోని పిస్తాహౌస్ ముందు వాహనాల అక్రమ పార్కింగ్, పుట్ పాత్ అక్రమణల వల్ల తీవ్ర సమస్యలు ఏర్పడుతున్నాయి ఈ సమస్యపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అథికారులకు వెళ్ళడంతో జీహెచఎంసీ, ట్రాఫిక్, ఆర్ అండ్ బీ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య అక్రమణలు తొలగించారు.