prathighatana.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 2:45 pm Digital Edition : PRATHI GHATANA

అభాగ్యులకు కేఎల్ఆర్ ట్రస్ట్ ఆపన్న హస్తం

మాతృదేవోభవ అనాథాశ్రమానికి రూ.10 లక్షల వితరణ

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

పేదలకు, అభాగ్యులకు, పేద విద్యార్థులకు నిరంతరం కేఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవ చేసే భాగ్యం కలగటం తన అదృష్టమని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కే.ఎల్.ఆర్ ట్రస్ట్ అధినేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ డివిజన్ నాదర్ గుల్ గ్రామంలోని మాతృదేవో భవ అనాథాశ్రమానికి రూ.10 లక్షల విలువ చేసే భవన నిర్మాణ ఇనుము సహా మెటీరియల్ అందజేశారు. ట్రస్ట్ నిర్వాహాకులు. అభాగ్యులు, నిరుపేదలు, మతిస్థిమితం లేని వారికి ఆశ్రమం కల్పిస్తున్న గట్టు గిరిని కేఎల్ఆర్ అభినందించారు. నూతన ఆశ్రమంలో జరుగుతున్న పనులను లక్ష్మారెడ్డి గతంలో పరిశీలించారు. తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.10 లక్షల విలువైన మెటీరియల్ ను పంపటంతో అనాథాశ్రమ నిర్వాహాకులు గట్టు గిరి సంతోషం వ్యక్తం చేశారు.

సేవకుడే నాయకుడు- కాంగ్రెస్ నేతలు

సేవకుడే నాయకుడు అంటూ పదేపదే మాట చెప్పే కిచ్చెన్నగారు ఇచ్చిన మాట నిల బెట్టుకున్నారని నాదర్ గుల్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పేదల కోసం కేఎల్ఆర్ ట్రస్ట్ స్థాపించి ఎందరికో సేవ చేస్తున్నారని కొనియాడారు. ఓట్ల కోసం కాకుండా పేద విద్యార్థుల కోసం సైతం లీడ్ ఇండియా స్థాపించి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను, నైపుణ్య శిక్షణను నేటి తరానికి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అందిస్తున్నారని పార్టీ నేతలు గుర్తు చేశారు.