సస్పెండ్ అయిన అధికారుల వెనుకుండి నడిపించిన సూత్రధారుల, పాత్రధారుల చిట్టాను బయటపెట్టాలి.
బడంగ్ పేట్ సర్కిల్ కార్యాలయం ముందు బీజేపీ వినూత్న నిరసన
ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
గత 12 సంవత్సరాలుగా బడంగ్‌పేట్ నగర పంచాయతీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ దాకా అవినీతి నిరాటంకంగా కొనసాగుతూనే ఉందని, ఈ దోపిడీపై మొదటి నుంచి బీజేపీనే పోరాటం చేస్తోందని అవినీతికి పాల్పడిన ఏ ఒక్క రాజకీయ నాయకుడిని వదిలిపెట్టకూడదని బడంగ్‌పేట్ బీజేపీ క్లస్టర్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్‌లో వెలుగులోకి వచ్చిన రూ. 150 కోట్ల భారీ అవినీతి కుంభకోణం జరిగి డిప్యూటీ కమిషనర్‌తో పాటు 10 మంది అధికారులు సస్పెండైన సందర్భంగా బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బడంగ్‌పేట్ బీజేపీ క్లస్టర్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్‌లో వెలుగులోకి వచ్చిన రూ.150 కోట్ల భారీ అవినీతి కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేస్తోందని మండిపడ్డారు. డిప్యూటీ కమిషనర్‌తో పాటు 10 మంది అధికారులు సస్పెండ్ కావడంతో ఈ అవినీతి ఎంత విస్తృతంగా జరిగిందో స్పష్టంగా చూపిస్తోందని అన్నారు. కాంట్రాక్టర్లు కే. శ్రీధర్ రెడ్డి సాయినాథ్ , తదితర మహాత్ములు కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్నారనీ.. ఈ అవినీతి కేవలం అధికారుల పని కాదు.. దీని వెనుక గతంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పెద్దల రాజకీయ ఆశీర్వాదం కూడా ఉందన్నారు. అసలు నేరస్థులు బయటపడాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లు ఈ అవినీతిలో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండిస్తూ.. దోషులు బయట పడతారనే భయంతో బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత 12 సంవత్సరాలుగా బడంగ్‌పేట్ నగర పంచాయతీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ దాకా అవినీతి నిరాటంకంగా కొనసాగుతూనే ఉందని, ఈ దోపిడీపై మొదటి నుంచి బీజేపీనే పోరాటం చేస్తోందని తెలిపారు. ఇకపై ఈ పోరాటం మరింత తీవ్రంగా ఉంటుందని, అవినీతి చేసిన ఏ ఒక్క నాయకుడినైనా, అధికారి నైనా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. బడంగ్‌పేట్ సర్కిల్‌లో కాంట్రాక్టర్లు పని చేయకుండానే టెండర్లు మంజూరు చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని, బాలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పాత బాత్రూంలకు పైపై మరమ్మతులు చేసి రూ.40 లక్షలు మింగేశారని ఆరోపించారు. “ఈ అవినీతి బాగోతం బయటపడటానికి బీజేపీ ఇచ్చిన ఫిర్యాదులే కారణమన్నారు. లేదంటే ఈ దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉండేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసును సిట్ లేదా సీబీఐతో విచారణ చేయాలని, సంబంధిత రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ప్రజల డబ్బు పూర్తిగా రికవరీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. అవినీతి బయటపడేదాకా బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలో ఏ ఒక్కరు కూడా ఎటువంటి పన్నులు చెల్లించకూడదని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, గడ్డం లక్ష్మారెడ్డి, దడిగ శంకర్, క్లస్టర్ 2 అధ్యక్షుడు వీర కర్ణ రెడ్డి ,మీర్ పేట్ క్లస్టర్ అధ్యక్షుడు బిక్షపతి చారి, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, సీనియర్ నాయకులు సామ సంజీవరెడ్డి, నడికుడ యాదగిరి, గుర్రం మల్లారెడ్డి, పి. శ్రీనివాస్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి , ప్రకాష్ రెడ్డి, రేసు నరసింహారెడ్డి, నీల రవి నాయక్, ఐలేష్ యాదవ్ , మధుసూదన్ రెడ్డి, లక్ష్మణ్, అంజిరెడ్డి, పుల్లారెడ్డి, నిమ్మల, రవికాంత్ గౌడ్, లోకం ముదిరాజ్, లాలా సందీప్, రమావత్ రవి నాయక్, రవీందర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి , శూరకర్ణ రెడ్డి, మంత్రి కృష్ణ, మారుతి రెడ్డి, పోరెడ్డి నితిన్, బంగారు రాహుల్, భరత్, మంత్రి శ్రీధర్, రామాచారి, యాదిరెడ్డి, అరవింద్, మల్లేష్, ఆంజనేయులు, కిరణ్ రాజ్ , పాశం శివ, బడంగ్ పేట్ సర్కిల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
