ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణఅక్రమ షెడ్డు ప్రారంభోత్సవంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు - భళారే విచిత్రం..

అక్రమ షెడ్డు ప్రారంభోత్సవంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు – భళారే విచిత్రం..

📰 Generate e-Paper Clip

ముఖ్యఅతిథిగా హాజరై అక్రమ షెడ్డును ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు 

ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే.. తాజా మాజీ కార్పొరేటర్, ఆమె భర్త

పోటీ పడి మరి.. అక్రమ షెడ్డు ప్రారంభోత్సవానికి హాజరు..?

మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి భారీ గండి

టౌన్ ప్లానింగ్ అధికారులు పాత్రధారులే..

సూత్రధారులంతా స్థానిక ప్రజాప్రతినిధులే..!?

అందిన కాడికి దండుకొని అక్రమ నిర్మాణాలకు ప్రోత్సాహం..?

అందుకు ప్రత్యక్ష సాక్ష్యం.. ఈ చిత్రం..!

ప్రతిఘటన, ఎల్బీనగర్ ప్రతినిధి :

మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద అంబర్ పేట్ సర్కిల్ 11లో అక్రమ కమర్షియల్ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు, అక్రమ షెడ్ల నిర్మాణాలకు ప్రజా ప్రతినిధులు, మాజీ లు, అధికారులు ముక్కుముడిగా కలిసి బల్దియా ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు..? అనేదానికి ఈ చిత్రమే.. ప్రత్యక్ష సాక్ష్యం..!? ఇటీవల నాగోల్ డివిజన్ పరిధి పెద్ద అంబర్ పేట్ సర్కిల్ 11 లోని అరుణోదయ కాలనీ రోడ్ నెంబర్ 10 లో బాబాయి హోటల్ పేరుతో ఎటువంటి అనుమతులు లేని ఓ అక్రమ షెడ్డు వెలసింది. ఈ అక్రమ షెడ్డు నిర్మాణంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ అక్రమ నిర్మాణం పై అధికారులకు అనేక ఫిర్యాదులు అందిన స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ భర్త అండదండలు ఉండడంతో.. పాటు తమకు అందాల్సిన ముడుపులు అందుకొని ఈ అక్రమ షెడ్డు నిర్మాణం జోలికి వెళ్లలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేక పత్రికల్లో ఇలాంటి అక్రమ నిర్మాణాల వల్ల బల్దియా ఆదాయానికి గండి పడటంతో పాటు.. ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులనే కథనాలు కూడా ప్రచురితమయ్యాయి.

అక్రమ షెడ్డు ప్రారంభోత్సవానికి పోటీపడి మరి..!?

నాగోల్ డివిజన్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ షెడ్డులో ఏర్పాటు చేసిన బాబాయ్ హోటల్ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఈ అక్రమ షెడ్డు నిర్మాణ ప్రారంభోత్సవానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులతో పాటు స్థానిక ఎమ్మెల్యే, తాజా మాజీ కార్పొరేటర్, ఆమె భర్త ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రతినిధులు..!

అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే, తాజా మాజీ కార్పొరేటర్, ఆమె భర్త ప్రారంభించడంతో.. భళారే విచిత్రం అంటూ.. స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో ఈ అక్రమ షెడ్డు నిర్మాణంలో తనకు కూడా పార్టనర్ షిప్ ఉందంటూ.. స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ భర్త అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు తమకు అందాల్సిన ముడుపులు ముట్టడంతో అటువైపు కన్నెత్తి చూడలేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజా మాజీ కార్పొరేటర్ భర్తకు కూడా భారీ మొత్తంలో మడుపులు అందినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అక్రమ షెడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులే పోటీపడి మరీ.. ప్రారంభించడంతో.. ఇక ఇలాంటి అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు, అక్రమ షెడ్లు కొ..కొల్లలుగా.. వెలుస్తాయని..! స్థానికులు చర్చించుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!