కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ మండల నాయకులు గుమ్మకొండ భూషయ్య
ప్రతిఘటన, నాగర్ కర్నూల్
బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
బిజినాపల్లి మండలంలోని లట్టుపల్లి గ్రామంలో అక్రమంగా కంట్రోల్ బియ్యాన్ని రవాణ చేస్తున్నారని బిజినపల్లి బీజేపీ మండల మాజీ అధ్యక్షులు గుమ్మకొండ భూషయ్య తెలిపారు. జిల్లా పౌరసంబంధాల అధికారికి విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డీలర్, వ్యాపారులు రాత్రి సమయంలో రైస్ మిల్లర్ కు పేదల సొమ్ము కంట్రోల్ బియ్యాన్ని రాత్రికి రాత్రి అమ్ముకుంటున్నారని వారన్నారు. వీటిపై తక్షణమే చర్య తీసుకోవాలని సోమవారం జిల్లా కలెక్టర్ ను రాతపూర్వకంగా కోరగా కలెక్టర్ గారు స్పందించి చర్యలు తీసుకుంటామని అన్నారన్నారు. ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం ఇస్తున్నందున మండలంలోని రేషన్ డీలర్లు వ్యాపారులు ఇదే అదునుగా అన్ని గ్రామాల్లో దందాలు ప్రారంభించారన్నారు. పేదలకు అందుతున్న కంట్రోల్ బియ్యాన్ని కాజేస్తున్న వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.