ePaper
Tuesday, April 7, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeరంగారెడ్డిఅక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాల కూల్చివేత

📰 Generate e-Paper Clip

గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుని నిర్మాణాలు చేపట్టాలి లేకపోతే కూల్చడం ఖాయం

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

మహేశ్వరం మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం కొరడా ఝలుపించింది. గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుని నిర్మాణాలు చేపట్టాలి లేకపోతే కూల్చడం ఖాయమని మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ తెలిపారు. సోమవారం మహేశ్వరం పరిధిలో గ్రామ పంచాయతీ ద్వారా అనుమతులు పొందకుండా నూతనముగా గృహ నిర్మాణం చేపడుతున్న గృహ నిర్మాణాలను గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, పాలక వర్గ సభ్యులు పంచాయతీ కార్యదర్శి సుజాత అక్రమ గృహ నిర్మాణాలను జేసీబీ ద్వారా కూల్చివేయడం జరిగింది. ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ మహేశ్వరం పరిధిలో ఎవరైన నూతన గృహ నిర్మాణాలు చేపట్టదలచిన వారు తప్పకుండ గ్రామ పంచాయతీ అనుమతి పొంది, గ్రామ పంచాయతీ కార్యాలయం ద్వారా సూచించిన కొలతల ప్రకారం రోడ్డు నుండి సెట్ బ్యాక్ వదిలి నిర్మాణం చేపట్టలని గ్రామ ప్రజలకు సూచనలు చేశారు. సూచనలు పాటించని గృహ యజమానులపై తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం – 2018 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జొరల రమేశ్ , వార్డు సభ్యులు తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, భవన కార్మిక సంఘం మండల అధ్యక్షులు జోరల శ్రీశైలం, మహేశ్వరం గ్రామ భవన కార్మిక సంఘం అధ్యక్షులు పెయ్యల రవి, ఉపాధ్యక్షులు ఖానపురం రాజు, సలేకుల పర్వతాలు, భవన కార్మిక సంఘం కార్యదర్శి స్వర్ణగంటి కన్నయ్య , ఖానపురం చెన్నయ్య, కటికల శంకర్, ఆశనగారి నరసింహ, పంచాయతీ కార్యదర్శి సుజాత పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!