అంకెల గారడీ బడ్జెట్ లో అన్ని వర్గాలకు అన్యాయం – బీఆర్ఎస్
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అంకెలగారడీ బడ్జెట్ లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నీ వర్గాలను నిరాశ పరిచిందన్నారు.
మూడవ బడ్జెట్లో కూడా ప్రభుత్వం సంక్షేమం పథకాలపై ఎక్కువ ద్రుష్టి పెడుతుందని ఆశించిన వారికి నిరాశ మిగిల్చిందన్నారు. బడ్జెట్ లో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు.. 11 డిక్లరేషన్ లకు అనుగుణంగా బడ్జెట్ రూపాకల్పన లేదన్నారు. బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్లు ఐదేండ్లకు లక్ష కోట్లు ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కేవలం 3.85 శాతం మాత్రమే కేటాయించారని ఆయన మండిపడ్డారు. బీసీ గురుకులాల్లో అన్నం సరిగ్గా లేక విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని, మైనారిటీ గురుకులాల్లో వసతులు లేక ఖాళీ అవుతున్నాయన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నం పెట్టె రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని, రైతు భరోసా ఇవ్వడం లేదన్నారు. కరెంటు సరిగ్గా లేదు.. సకాలంలో యూరియా అందించక పోవడం తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పండించిన తరువాత కనీసం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు, గురుకులాలు, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ అస్పత్రులు పెద్ద మొత్తంలో అభివృద్ధి చేసి రాష్ట్ర సంపద పెంచినమని, ప్రజల ఆస్తుల విలువ కూడా పెంచామన్నారు. బీసీ లకు రూ.50 వేల కోట్లు ఇవ్వాల్సిందేని, దళితుల అభివృద్ధి కోసం రూ. 10 లక్షలు బడ్జెట్ లో కేటాయించాలని డిమాండ్ చేశారు. అన్నీ పార్టీలు రాజకీయాలకు అతీతంగా అన్నీ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందె బడ్జెట్ రూపాకల్పన చేసేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మాజీ జెడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ చీమల రాజు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్ట బోయిన గోపాల్, చేన్న మహేష్, ర్యాకల శ్రీనివాస్, అజీముద్దిన్, సూరిపంగా సుభాష్, గుజ్జ పవన్ పాల్గొన్నారు.